Home

»

Latest News

మెగాస్టార్.. సినిమాకో సంగీత ద‌ర్శ‌కుడు!

Aug 28, 2021 5:50PM

మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్ర‌స్తుతం నాలుగు చిత్రాలున్నాయి. ఆ సినిమాలే.. `ఆచార్య‌`, `గాడ్ ఫాద‌ర్`, `బోళా శంక‌ర్`, `మెగా 154`. ఈ నాలుగు చిత్రాల‌ను కూడా చిరుని ఇదివ‌ర‌కు డైరెక్ట్ చేయ‌ని ద‌ర్శ‌కులే టేక‌ప్ చేస్తున్నారు. `ఆచార్య‌`ని కొర‌టాల శివ రూపొందిస్తుండ‌గా.. `గాడ్ ఫాద‌ర్`ని మోహ‌న్ రాజా తెర‌కెక్కిస్తున్నారు. `బోళా శంక‌ర్`ని మెహ‌ర్ ర‌మేశ్ తీర్చిదిద్ద‌నుండ‌గా.. `మెగా 154`కి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

అంతేకాదు.. ఈ నాలుగు సినిమాల‌కు వేర్వేరు సంగీత ద‌ర్శ‌కులు బాణీలు క‌ట్ట‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. `ఆచార్య‌`కి మెలోడీబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చుతుండ‌గా.. `గాడ్ ఫాద‌ర్`కి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు. `మెగా 154`కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ట్యూన్స్ ఇవ్వ‌నుండ‌గా.. `బోళా శంక‌ర్`కి మ‌ణి త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ కంపోజ‌ర్ గా ప‌నిచేయ‌నున్నాడు. వీరిలో మ‌ణిశ‌ర్మ‌, డీఎస్పీ ఇప్ప‌టికే చిరుతో సినిమాలు చేయ‌గా.. త‌మ‌న్, మ‌హ‌తికి మాత్రం ఇవే ఫ‌స్ట్ జాయింట్ వెంచ‌ర్స్.

 మ‌రి.. సినిమాకో సంగీత ద‌ర్శ‌కుడు అన్న‌ట్లుగా రాబోతున్న చిరు కొత్త చిత్రాలు.. బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటాయో చూడాలి. అలాగే, వీటిలో ఏయే సినిమాలు మ్యూజిక‌ల్ గా మెప్పిస్తాయి? అన్న‌ది కూడా ఆస‌క్తిక‌ర‌మే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com