![]() |
![]() |

వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలిచే తమిళ కథానాయకుల్లో సూర్య ఒకరు. ప్రయోగాలకు పెద్దపీట వేసే ఈ వెర్సటైల్ స్టార్.. త్వరలో మరో ఆసక్తికరమైన వేషంలో కనిపించనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఖైదీ`, `మాస్టర్` వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్ లో సూర్య కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో ఓ సూపర్ హీరోగా దర్శనమివ్వనున్నారట సూర్య. అంతేకాదు.. ప్రయోగశాలలో వికటించిన ఓ ప్రయోగం కారణంగా అప్పటికే ఓ చేతిని కోల్పోయిన ఈ సూపర్ హీరో.. కంటికి కూడా కనిపించడట. ఈ నేపథ్యంలో.. ఈ సూపర్ హీరో చేసే విన్యాసాల చుట్టూ సినిమా తిరుగుతుందట. కాగా, ఈ చిత్రానికి `ఇరుంబు కై మాయావి` అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు కోలీవుడ్ టాక్. త్వరలోనే సూర్య, లోకేశ్ కనకరాజ్ కాంబో మూవీపై క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సూర్య చేతిలో `జై భీమ్`, `ఎదర్కుమ్ తుణిందవన్` చిత్రాలు ఉన్నాయి. ఇక లోకేశ్ కనకరాజ్ విషయానికి వస్తే.. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కాంబినేషన్ లో `విక్రమ్` చేస్తున్నారు. ఆయా చిత్రాల కమిట్మెంట్స్ పూర్తయ్యాకే సూర్య - లోకేశ్ కాంబో మూవీ పట్టాలెక్కుతుందని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్.
![]() |
![]() |