![]() |
![]() |

`ముకుంద` (2014) చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన వరుణ్ తేజ్.. `ఫిదా` (2017)తో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆపై `తొలిప్రేమ` (2018), `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేశ్` (2019) వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా `గని`, హిలేరియస్ ఎంటర్టైనర్ `ఎఫ్ 3` చిత్రాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్.. త్వరలో `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. `ఛత్రపతి` ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారని టాక్. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. కాగా, ఈ చిత్రంతో పాటే ఓ పాన్ - ఇండియా మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వరుణ్ తేజ్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
మెగా కాంపౌండ్ లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి `సైరా.. నరసింహారెడ్డి` రూపంలో ఓ పాన్ - ఇండియా మూవీ చేయగా.. `హరిహర వీరమల్లు`తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `పుష్ప`తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, `ఆర్ ఆర్ ఆర్`తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే బాటలో వెళ్ళనున్నారు. ఇప్పుడు వీరి దారిలోనే వరుణ్ కూడా వెళ్ళనున్నాడన్నమాట.
![]() |
![]() |