![]() |
![]() |

రెండు దశాబ్దాలకి పైగా నటుడిగా అలరిస్తున్నారు అజయ్. ఒకవైపు పాజిటివ్ రోల్స్ లోనూ ఎంటర్టైన్ చేస్తూనే.. మరోవైపు నెగటివ్ రోల్స్ లోనూ తనదైన ముద్ర వేశారు ఈ టాలెంటెడ్ యాక్టర్. అలాగే కథానాయకుడిగానూ మురిపించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా అజయ్ ఓ పాన్ - ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ సినిమా మరేదో కాదు... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తున్న `పుష్ప`. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్ లో బన్నీకి అన్నగా కనిపించనున్నారట అజయ్. అంతేకాదు.. ఈ పాత్రకి వ్యతిరేక ఛాయలుంటాయని బజ్. డైరెక్టర్ సుకుమార్ ఈ క్యారెక్టర్ ని ఎంతో స్పెషల్ గా డిజైన్ చేశారని అంటున్నారు. త్వరలోనే `పుష్ప`లో అజయ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. బన్నీ, సుకుమార్ గత చిత్రం `ఆర్య 2`(2009)లో అజయ్ ఓ విలన్ గా కనిపించారు. మళ్ళీ పుష్కరకాలం తరువాత `పుష్ప` కోసం వీరి కాంబినేషన్ లో జట్టుకడుతుండడం విశేషం.
కాగా, `పుష్ప`లో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందన్న నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నాడు. క్రిస్మస్ సీజన్ లో ఈ యాక్షన్ థ్రిల్లర్ తాలూకు ఫస్ట్ పార్ట్ `పుష్ప - ద రైజ్`.. థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |