![]() |
![]() |

ఒక గోవా రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి, బీచ్‌లో సన్నిహితంగా కనిపిస్తూ పోజులిచ్చాక ఖడ్గం హీరోయిన్ కిమ్ శర్మ, టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ మధ్య రొమాంటిక్ యాంగిల్ వైరల్ అయింది. అప్పట్నుంచి కూడా ఆ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసేట్లు కిమ్, లియాండర్ లేటెస్ట్‌గా ఒక కాఫీ షాప్ దగ్గర జంటగా దర్శనమిచ్చారు. చూస్తుంటే వారు కాఫీ డేట్ కోసమే అక్కడకు వచ్చినట్లు అనిపిస్తోంది.

కిమ్, లియాండర్ జంటగా బయటకు వచ్చినప్పుడల్లా పాపరాజ్జి వారిని తమ కెమెరాల్లో బంధిస్తూ వస్తోంది. వారు కూడా తమ రిలేషన్‌షిప్‌ను దాచుకోవడానికి, కెమెరాల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు. కాఫీ షాప్ దగ్గర కిమ్ శర్మ అథ్లెటిక్ డ్రస్‌లో కనిపించింది. బ్లాక్ జిమ్ టైట్స్, వైట్ జాకెట్, వైట్ స్నీకర్స్‌తో ఆకట్టుకుంటోంది. లియాండర్ సెమి-ఫార్మల్ లుక్‌లో కనిపించాడు. తను గ్రే ట్రౌజర్స్, బ్లాక్ టి-షర్ట్ ధరించాడు. ఇద్దరి చేతుల్లోనూ సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఒక పిక్చర్‌లో కిమ్‌కు లియాండర్ ఏదో చెప్తున్నట్లు కనిపించగా, మరో ఫొటోలో ఆమె ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఉంది.

![]() |
![]() |