![]() |
![]() |
నేచురల్ స్టార్ నాని నటించిన కొత్త చిత్రం `టక్ జగదీష్` ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. `నిన్ను కోరి` (2017) వంటి విజయవంతమైన సినిమా తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న స్ట్రీమ్ కాబోతోంది. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించేశారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. నాని గత చిత్రం `వి` కూడా గత ఏడాది ఇదే సెప్టెంబర్ లో ఇదే అమెజాన్ ప్ర్రైమ్ లో స్ట్రీమ్ అయింది. అందులో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. తన తొలి చిత్రం `అష్టా చమ్మా` (2008) థియేటర్స్ లో పలకరించిన సెప్టెంబర్ 5నే తొలిసారిగా ఓటీటీలోనూ విష్ చేశాడు నాని.
భారీ అంచనాల నడుమ స్ట్రీమ్ అయిన `వి` అనూహ్యంగా విమర్శల పాలవ్వడమే కాకుండా నెగటివ్ రిజల్ట్ ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో.. సేమ్ మంత్ - సేమ్ ఓటీటీ వేదికలో `టక్ జగదీష్`తో పలకరిస్తున్న నానికి ఈ సారైనా పాజిటివ్ రిజల్ట్ దక్కుతుందేమో చూడాలి.
![]() |
![]() |