![]() |
![]() |

`బుట్టబొమ్మ` పూజా హెగ్డే ఇప్పటివరకు తొమ్మిది తెలుగు చిత్రాల్లో నటించి.. వెండితెరపై వెలుగులు పంచింది. గమనించదగ్గ విషయమేమిటంటే.. వీటిలో ఐదు చిత్రాలు `మెగా` కాంపౌండ్ హీరోలతో చేసినవే. ఆ సినిమాలే.. `ముకుంద`, `డీజే`, `రంగస్థలం` (ఐటమ్ సాంగ్), `గద్దలకొండ గణేశ్`, `అల వైకుంఠపురములో`. వీటిలో చివరి మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ ముంగిట మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
కట్ చేస్తే.. త్వరలో తన ఆరో `మెగా` ప్రాజెక్ట్ `ఆచార్య`తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతోంది మిస్ హెగ్డే. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న ఈ సోషల్ డ్రామాలో రామ్ చరణ్ సరసన కనువిందు చేయనుంది పూజ. ఇదిలా ఉంటే.. పూజ ఖాతాలో ఏడో మెగా ప్రాజెక్ట్ కన్ఫామ్ అయిందని బజ్. ఆ సినిమా మరేదో కాదు.. `గబ్బర్ సింగ్` వంటి బ్లాక్‌బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా.
త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇద్దరు నాయికలకు స్థానముండగా.. మెయిన్ లీడ్ గా పూజ ఫిక్సయిందని వినికిడి. అంతేకాదు.. `గబ్బర్ సింగ్`లో శ్రుతి హాసన్ చేసిన పాత్ర తరహాలో పూజ కూడా ట్రెడిషనల్ లుక్ తోనే దర్శనమివ్వనుందని సమాచారం. త్వరలోనే పవన్ - హరీశ్ కాంబో మూవీలో పూజ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
ఇప్పటికే `డీజే`, `గద్దలకొండ గణేశ్`.. ఇలా హరీశ్ శంకర్ తో రెండు సినిమాలు చేసిన పూజ.. త్రివిక్రమ్ తరువాత మరో అగ్ర దర్శకుడితో `రౌండ్ 3`కి రెడీ అవుతోందన్నమాట.
![]() |
![]() |