![]() |
![]() |

'జూలియాస్ ఐస్'.. 2010లో విడుదలైన స్పానిష్ మూవీ. తన సోదరి అనుమానస్పద మృతి వెనుక రహస్యాన్ని ఛేదించే క్రమంలో నెమ్మదిగా తన చూపు కోల్పోయే ఓ మహిళ కథే ఈ చిత్రం. 117 నిమిషాల పాటు సాగే ఈ హారర్ థ్రిల్లర్ ఆ జోనర్ లవర్స్ ని అప్పట్లో అమితంగా ఆకట్టుకుంది.
కట్ చేస్తే.. ఇప్పుడీ సినిమాకి ఐదు ఇండియన్ వెర్షన్స్ రూపొందుతున్నాయని బజ్. ఆ వివరాల్లోకి వెళితే.. తాప్సీ ప్రధాన పాత్రలో `బ్లర్` పేరుతో ఆమె స్వీయ నిర్మాణంలోనే హిందీ వెర్షన్ తెరకెక్కుతుండగా.. మరాఠీలో `సిద్ధు ఫ్రమ్ సికాకుళం` ఫేమ్ మంజరి ఫడ్నీస్, రితేశ్ దేశ్ ముఖ్ ముఖ్య పాత్రల్లో `అదృశ్య` పేరుతో తయారవుతోంది. ఇక బెంగాలీలో రీతూపర్ణ సేన్ గుప్తా మెయిన్ లీడ్ గా `అంతర్ దృష్టి` టైటిల్ తో రీమేక్ అవుతుండగా.. తమిళంలో `ఉన్ పార్వైల్` పేరుతో పునర్నిర్మితమవుతోంది. అలాగే తెలుగులో `అగోచర` పేరుతో ఇషా చావ్లా, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా కూడా ఈ స్పానిష్ మూవీకి రీమేక్ అని టాక్.
మొత్తమ్మీద.. 11 ఏళ్ళ నాటి స్పానిష్ హారర్ థ్రిల్లర్ 'జూలియాస్ ఐస్'.. ఇప్పుడు ఏకంగా ఐదు భారతీయ భాషల్లో రీమేక్ అవుతుండడం విశేషమనే చెప్పాలి. మరి.. వీటిలో ఏ రీమేక్‌లకు ప్రేక్షకాదరణ దక్కుతుందో చూడాలి.
![]() |
![]() |