![]() |
![]() |

`జై చిరంజీవ!` (2005)తో చివరిసారిగా క్రిస్మస్ సీజన్ లో సందడి చేశారు మెగాస్టార్ చిరంజీవి. కట్ చేస్తే.. పదహారేళ్ళ తరువాత మరోమారు అదే సీజన్ లో పలకరించబోతున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. `ఖైదీ నంబర్ 150`, `సైరా.. నరసింహారెడ్డి` వంటి బ్యాక్ టు బ్యాక్ కెరీర్ బెస్ట్ గ్రాసర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిరు.. త్వరలో `ఆచార్య`గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సోషల్ డ్రామా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
కాగా, ఈ చిత్రాన్ని దసరా సీజన్ లో గానీ లేదా సంక్రాంతి సమయంలోగానీ విడుదల చేస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. క్రిస్మస్ బరిలో `ఆచార్య` ఎంటర్టైన్ చేసే అవకాశముందంట. అంతేకాదు.. అదే సీజన్ లో రిలీజ్ డేట్ ని కన్ఫామ్ చేసుకున్న అల్లు అర్జున్ `పుష్ప` వాయిదా పడే అవకాశముంటున్నారు. త్వరలోనే `ఆచార్య` విడుదల తేదిపై క్లారిటీ రానున్నది.
కాగా, `ఆచార్య`లో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తుండగా.. చిరుకి జంటగా కాజల్, చరణ్ సరసన పూజా హెగ్డే దర్శనమివ్వనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మణిశర్మ బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |