![]() |
![]() |
.jpg)
'టక్ జగదీష్' థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రావడానికే డిసైడ్ అయ్యాడు. అవును. ఓవైపు నాగచైతన్య - సాయిపల్లవి 'లవ్ స్టోరి' సెప్టెంబర్ 10న థియేటర్లలో రావడానికి సిద్ధమవుతుండగా, అదే రోజు అమెజాన్ ప్రైమ్‌లో 'టక్ జగదీష్'గా వచ్చేందుకు నాని నిశ్చయించుకున్నాడు. నిజానికి ఇందులో నాని ప్రమేయం ఏమీ లేదని చెప్పాలి. ఆయన థియేటర్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ, అమెజాన్ ప్రైమ్ నుంచి మంచి ఆఫర్ రావడంతో సేఫ్ సైడ్‌గా ఉండేందుకు ఆ సినిమా నిర్మాతలు ఓటీటీకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో సెప్టెంబర్ 10న థియేటర్స్ వర్సెస్ ఓటీటీ అనే పరిస్థితి నెలకొంది.
శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన 'టక్ జగదీష్'లో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, నాజర్, రావు రమేశ్, నరేశ్, రోహిణి, దేవదర్శిని కీలక పాత్రలు చేశారు. తమిళ యాక్టర్ డానియల్ బాలాజీ విలన్‌గా కనిపించనున్నాడు. తమన్ సంగీతం సమకూర్చగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు.
'టక్ జగదీష్' డైరెక్టుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ కానున్నట్లు వార్తలు వచ్చినప్పట్నుంచీ వివాదం నెలకొంది. ఎందుకంటే అంతకు ముందు ఓ సినిమా ఈవెంట్‌లో థియేటర్లలోనే అందరూ సినిమాలు రిలీజ్ చెయ్యాలనీ, థియేటర్లలో సినిమా చూస్తే ఆ కిక్కే వేరన్నట్లు నాని స్వయంగా మాట్లాడాడు. అలాంటిది ఇప్పుడు అతడి సినిమాయే నేరుగా ఓటీటీలో రిలీజవుతుండటంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. దాంతో అతను స్పందించక తప్పలేదు. తాను ఎంతగానో ప్రయత్నించినా లాభం లేకపోయిందనీ, నిర్మాతలకు వేరే ఆప్షన్ లేకపోవడంతో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారనీ వివరణ ఇచ్చాడు.
![]() |
![]() |