![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `అఖండ`. యాక్షన్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదిపై అధికారిక ప్రకటన రానుంది.
ఇదిలా ఉంటే.. `అఖండ` ఫస్ట్ సింగిల్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ పాటని విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా చిత్ర సంగీత దర్శకుడు తమన్.. `అఖండ` ఫస్ట్ సింగిల్ కి సంబంధించి ట్విట్టర్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే త్వరలోనే ఈ పాట రిలీజ్ కాబోతున్నట్లు క్లూ ఇచ్చారు. అందుకు తగ్గట్టే.. వినాయక చవితికి `అఖండ` తొలి పాట రాబోతోందంటూ కథనాలు వస్తున్నాయి. మరి.. ఆ రోజే `అఖండ` ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందో లేదంటే అటుఇటుగా విడుదలవుతుందో చూడాలి.
కాగా, `అఖండ`లో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుండగా శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |