![]() |
![]() |

ఒకవైపు బుల్లితెరపై వ్యాఖ్యాతగా రాణిస్తూనే.. మరోవైపు వెండితెరపై నటిగా తనదైన ముద్ర వేస్తోంది అనసూయ. మరీముఖ్యంగా.. `రంగస్థలం` చిత్రంలో `రంగమ్మత్త`గా మెస్మరైజ్ చేసిందీ `జబర్దస్త్` బ్యూటీ. ప్రస్తుతం అనసూయ చేతిలో `పుష్ప`, `ఖిలాడి`, `రంగమార్తాండ` సినిమాలున్నాయి. వీటన్నింటిలోనూ కీలక పాత్రల్లో నటిస్తోంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఇదిలా ఉంటే.. తాజాగా అనసూయకి ఓ మెగా ప్రాజెక్ట్ లో ముఖ్య పాత్రలో నటించే అవకాశం దక్కిందట. ఆ సినిమా మరేదో కాదు.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న `గాడ్ ఫాదర్`. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసిఫర్`కి రీమేక్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం అనసూయకి దక్కిందట. అయితే, ఆమె పోషించే పాత్ర ఏమిటన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే `గాడ్ ఫాదర్`లో అనసూయ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
`హనుమాన్ జంక్షన్` ఫేమ్ మోహన రాజా డైరెక్ట్ చేస్తున్న `గాడ్ ఫాదర్` ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. 2022 ప్రథమార్ధంలో `గాడ్ ఫాదర్` థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
![]() |
![]() |