![]() |
![]() |

'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత పంజా వైష్ణవ్‌తేజ్ కథనాయకుడిగా నటిస్తోన్న చిత్రం 'కొండపొలం'. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో రకుల్‌ప్రీత్ సింగ్ నాయికగా నటిస్తోంది. అక్టోబర్ 8న థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల వైష్ణవ్‌తేజ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన నిర్మాతలు, ఈరోజు రకుల్‌ప్రీత్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. 'కొండపొలం'లో రవి ప్రేమించిన ఓబులమ్మగా రకుల్‌ప్రీత్ దర్శనమివ్వనుంది.
ఫస్ట్ లుక్ గ్లిమ్స్‌లో ఆమె సంప్రదాయ పల్లె యువతిగా కనిపించింది. లంగా, ఓణీలో బ్యూటిఫుల్‌గా ఉంది. వైష్ణవ్‌తేజ్‌కు వీపు ఆనించి, ఆనందంగా అతని కళ్లలోకి చూస్తున్న సన్నివేశం ఇంప్రెసివ్‌గా ఉంది. వైష్ణవ్‌తో పోల్చుకుంటే చాలా సీనియర్ అయినప్పటికీ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ చాలా బాగుంది. ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ ఇచ్చిన మెలోడీ సాంగ్ పల్లవిలోని "నీలో నాలో" అనే మాటలు ఈ గ్లిమ్స్‌లో మధురంగా వినిపించాయి.
ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన రకుల్‌ప్రీత్, "ఇదిగో ఓబులమ్మ - నేను బాగా ఇష్టపడ్డ క్యారెక్టర్. నమ్మశక్యంకానంత ధైర్యం, కరిష్మా, ప్రేమ-జీవితాన్ని అవగాహన చేసుకున్న గొర్రెలను కాచే అమ్మాయి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను." అని రాసుకొచ్చింది.

సాయిచంద్, నాజర్, కోట శ్రీనివాసరావు, అన్నపూర్ణ, హేమ, ఆంథోని, రవిప్రకాశ్, మహేశ్ విట్టా, రచ్చ రవి, ఆనంద్ విహారి కీలక పాత్రధారులైన 'కొండపొలం' మూవీని అదే పేరుతో సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రాసిన తానా బహుమతి పొందిన నవల ఆధారంగా క్రిష్ రూపొందిస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్‌గా, శ్రావణ్ కటికనేని ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
![]() |
![]() |