![]() |
![]() |

'మజిలీ', 'వెంకిమామ'తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న యువ సామ్రాట్ నాగచైతన్య.. `లవ్ స్టోరి`తో హ్యాట్రిక్ కొట్టేందుకు సన్నద్ధమయ్యాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల కానుంది. సెప్టెంబర్ నెలలో చైతూ సినిమా రిలీజ్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటివరకు మూడు సార్లు సెప్టెంబర్ లో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన చిత్రాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో ఒక్కటి కూడా విజయం సాధించలేదు.
ఆ వివరాల్లోకి వెళితే.. చైతూ హీరోగా నటించిన తొలి సినిమా `జోష్` (2009) ఇదే సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక `యుద్ధం శరణం` పేరుతో నాగచైతన్య చేసిన యాక్షన్ థ్రిల్లర్ కూడా 2017లో ఇదే సెప్టెంబర్ లో తెరపైకి వచ్చి ఫ్లాప్ లిస్ట్ లో చేరింది. అలాగే `శైలజా రెడ్డి అల్లుడు` (2018 సెప్టెంబర్) పేరుతో చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా ఆరంభ వసూళ్ళు బాగానే రాబట్టినా.. అంతిమంగా నిరాశపరిచింది.
మొత్తంగా.. మూడు సందర్భాల్లోనూ చైతూకి పాజిటివ్ రిజల్ట్స్ అయితే రాలేదనే చెప్పాలి. మరి.. `లవ్ స్టోరి`తో అయినా సెప్టెంబర్ నెగటివ్ సెంటిమెంట్ కి చైతూ బ్రేక్ వేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |