![]() |
![]() |

``ప్రేమకి కులమతాలు లేవని.. మతం కంటే మానవత్వం గొప్పద``నే పాయింట్ తో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం `సీతాకోక చిలక`. `శంకరాభరణం` వంటి ఆల్ టైమ్ క్లాసిక్ తరువాత పూర్ణోదయ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి తమిళ అగ్ర దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించారు. తనే రూపొందించిన తమిళ చిత్రం `అలైగళ్ ఓయ్వదిల్లై` (కార్తిక్, రాధ) ఆధారంగా ఈ ట్రెండ్ సెట్టర్ ని తెరకెక్కించారు భారతీరాజా. రెండు సినిమాలు కూడా నెల రోజుల వ్యవధిలో విడుదలై మ్యూజికల్ సెన్సేషన్స్ గా నిలవడం విశేషం.
మురళి (కార్తిక్), ముచ్చర్ల అరుణ, శరత్ బాబు, సిల్క్ స్మిత, జగ్గయ్య, డబ్బింగ్ జానకి, రాళ్ళపల్లి, మాస్టర్ అలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి బి.కన్నన్ అందించిన ఛాయాగ్రహణం అదనపు ఆకర్షణగా నిలిచింది.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతమందించగా.. దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ``మాటే మంత్రం``, ``సాగర సంగమమే`` (రెండు వెర్షన్స్), ``అలలు కలలు`` (రెండు వెర్షన్స్), ``మిన్నేటి సూరీడు``.. ఇలా ఇందులోని గీతాలన్నీ విశేషాదరణ పొందాయి.`ఉత్తమ ప్రాంతీయ చిత్రం`గా కేంద్రప్రభుత్వ పురస్కారాన్ని.. `ఉత్తమ చిత్రం`గా `నంది` అవార్డుని సొంతం చేసుకుని అప్పట్లో వార్తల్లో నిలిచిందీ సినిమా. 1981 ఆగస్టు 21న విడుదలైన `సీతాకోక చిలక`.. నేటితో 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |