![]() |
![]() |

రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `నారప్ప`లో తనదైన అభినయంతో మరోసారి అలరించారు విక్టరీ వెంకటేశ్. ప్రస్తుతం ఈ సీనియర్ స్టార్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఆ చిత్రాలే.. `దృశ్యం 2`, `ఎఫ్ 3`. మలయాళ చిత్రం `దృశ్యం 2`కి రీమేక్ గా మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ నిర్దేశకత్వంలోనే రూపొందిన `దృశ్యం 2` ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఇక `ఎఫ్ 2`కి సీక్వెల్ గా తయారవుతున్న `ఎఫ్ 3` విషయానికొస్తే.. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తీర్చిదిద్దుతున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. `ఎఫ్ 3` సినిమాకి సంబంధించి తన షూటింగ్ పార్ట్ ని సెప్టెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయబోతున్నారట వెంకటేశ్. ఆపై తన కొత్త చిత్రాన్ని విజయదశమి సందర్భంగా ప్రారంభించబోతున్నారని వినికిడి. మలయాళ చిత్రం `డ్రైవింగ్ లెసైన్స్`కి రీమేక్ గా రూపొందనున్న ఈ సినిమాని `నారప్ప` కెప్టెన్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తారని సమాచారం. త్వరలోనే వెంకీ కొత్త చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మరి.. వెంకీ - శ్రీకాంత్ కాంబో మరోసారి మెస్మరైజ్ చేస్తుందేమో చూడాలి.
![]() |
![]() |