![]() |
![]() |

యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా చిత్రం `మాస్ట్రో`. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అంధాధున్`కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాని `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్`, `ఎక్స్ ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందించగా.. నితిన్ హోమ్ బేనర్ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించింది. ఇందులో నితిన్ కి జంటగా `ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేశ్ నటించగా.. ప్రతినాయకురాలి పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా దర్శనమివ్వనుంది.
ఇదిలా ఉంటే.. `మాస్ట్రో` థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో నేరుగా స్ట్రీమ్ కాబోతుందంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే.. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పంద్రాగస్టు (ఆగస్టు 15)న `మాస్ట్రో` స్ట్రీమ్ కాబోతుందని కథనాలు వచ్చాయి. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. అయితే, తాజాగా ఆగస్టు 23న `మాస్ట్రో` ట్రైలర్ రిలీజ్ కాబోతుందంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్వీట్ చేయడంతో ఈ విషయంపై స్పష్టత వచ్చింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న `మాస్ట్రో` స్ట్రీమ్ కాబోతుందని వినికిడి. మరికొద్దిరోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
మరి.. ఓటీటీలో నేరుగా రిలీజవుతున్న ఈ సినిమాతో నితిన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |