![]() |
![]() |

ఇప్పుడు ప్రభాస్ మూడు పడవల మీద ప్రయాణం చేస్తున్నాడు. ఒక సినిమా తరువాత సినిమా మరో, మరో సినిమా తరువాత ఇంకో సినిమా... మూడు షూటింగ్స్ చేస్తున్నాడు. ప్రతి రెండు షెడ్యూల్స్ మధ్య స్మాల్ గ్యాప్ తీసుకుంటూ వీలైనన్ని ఎక్కువరోజులు షూటింగ్ చెయ్యడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.
'కె.జి.ఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ చేస్తున్న సినిమా 'సలార్'. హైదరాబాద్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. దాంతో ప్రభాస్ మళ్ళీ ముంబై వెళ్లారు. అక్కడ 'ఆదిపురుష్' షూట్ స్టార్ట్ చేశారు. రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీతగా కృతి సనన్ నటిస్తోంది. వీళ్ళిద్దరిపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట.
'సలార్', 'ఆదిపురుష్'తో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 'ప్రాజెక్ట్ కె' (వర్కింగ్ టైటిల్)ను కూడా ప్రభాస్ సెట్స్ మీదకు తీసుకువెళ్లాడు. అయితే, ముందు మొదలుపెట్టిన రెండు సినిమాల మేజర్ వర్క్ కంప్లీట్ అయ్యాక, మళ్ళీ 'ప్రాజెక్ట్ కె' స్టార్ట్ చేస్తారట.
![]() |
![]() |