![]() |
![]() |

హాస్య కథానాయకుడు `అల్లరి` నరేశ్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చిన చిత్రం `నాంది`. ఈ ఏడాది ఆరంభంలో థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందాడు.
ఇదిలా ఉంటే.. `నాంది` మంచి విజయం సాధించినా.. విజయ్ తదుపరి చిత్రంపై ఇంకా స్పష్టత రాలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. యువ సామ్రాట్ నాగచైతన్యతో ఈ టాలెంటెడ్ కెప్టెన్ నెక్స్ట్ వెంచర్ ఉండబోతోందట. `నాంది` తరహాలో ఇది కూడా విభిన్న ప్రయత్నమేనని టాక్. అంతేకాదు.. షైన్ స్క్రీన్ సంస్థ అధినేతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తారని.. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని వినికిడి. త్వరలోనే చైతూ - విజయ్ కనకమేడల కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది.
కాగా, నాగచైతన్య తాజా చిత్రం `లవ్ స్టోరి` విడుదలకు సిద్ధమైంది. ఇక ఆమిర్ ఖాన్ తో కలిసి నటిస్తున్న హిందీ చిత్రం `లాల్ సింగ్ చద్ధా` తాలుకూ షూటింగ్ ఇటీవలే పూర్తిచేశాడు చైతూ. అలాగే `థాంక్ యూ` చిత్రీకరణ దశలో ఉండగా.. తన తండ్రి, కింగ్ నాగార్జునతో కలిసి నటిస్తున్న మల్టిస్టారర్ `బంగార్రాజు` ఈ రోజు ప్రారంభమైంది.
![]() |
![]() |