![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' ఉక్రెయిన్ షెడ్యూల్ ముగించుకుని ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చారు. త్వరలో 'మీలో ఎవరు కోటీశ్వరులు' షూట్ స్టార్ట్ చేస్తారు. అయితే, అదేమంత పెద్ద విషయం కాదు. వారంలో రెండు మూడు రోజులు చేస్తే ఐదారు ఎపిసోడ్స్ తీసేయొచ్చు. 'ఆర్ఆర్ఆర్'లో తన పాత్రకు సంబంధించిన పార్ట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్రీ. కొరటాల శివ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి రెడీ అని చెప్పారట. 'ఆచార్య' విడుదలకు ముందే ఎన్టీఆర్30 షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి కొరటాల కూడా రెడీగా ఉన్నారట.
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తో కొరటాల శివ తీసిన సినిమా 'ఆచార్య'. రెండు పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మ్యాగ్జిమమ్ నెక్స్ట్ ఇయర్, సంక్రాంతికి సినిమాను రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఆలోపు ఎన్టీఆర్30 షూటింగ్ చాలావరకూ జరుగుతుంది.
అక్టోబర్ నెలలో ఎన్టీఆర్30 సెట్స్ మీదకు వెళ్లనుంది. 'ఆచార్య'లో రెండు పాటలను ఈ నెలలో కంప్లీట్ చేసి, సెప్టెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫినిష్ చెయ్యాలని కొరటాల ఫిక్స్ అయ్యారు. ఎన్టీఆర్30 సెట్స్ మీదకు వెళ్లే సమయానికి 'ఆచార్య' నుండి ఆయన కూడా ఫ్రీ అవుతారు. తర్వాత పబ్లిసిటీ చూసుకోవడమే.
![]() |
![]() |