![]() |
![]() |

దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన కమల్ హాసన్‌ను నట విద్యాలయంగా విమర్శకులు పరిగణిస్తుంటారు. భారతీయ సినిమా సుసంపన్న చరిత్రలోని గొప్ప పేర్లలో నిస్సందేహంగా ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది. అతి కొద్దిమందికే సాధ్యమైన అపురూపమైన కెరీర్ కలిగిన ఆయన కోట్లాది సినీ ప్రియుల హృదయాల్లో చెదరని ముద్ర వేశారు. తన గొప్ప మనసుతోనూ ఆయన అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. ఈసారి మన మూలాల్ని మరవకూడదనే ఒక మంచి సందేశాన్ని చెన్నైలోని తమ పాత ఇంటిని సందర్శించడం ద్వారా ఇచ్చారు కమల్.
రీసెంట్‌గా కమల్ అన్నయ్య చారు హాసన్ కుమార్తె, ప్రముఖ నటి సుహాసిని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా కొన్ని అపురూపమైన ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోల్లో చారు హాసన్ కుటుంబం, కమల్ హాసన్, ఆయన కుమార్తె అక్షర హాసన్ ఉన్నారు. తమ కుటుంబానికి చెందిన పాత భవంతి ముందు కూర్చొని /నిల్చొని ఈ ఫొటోలను వారు దిగారు. ఆ పిక్చర్స్‌తో పాటు, "ఎల్డమ్స్ రోడ్ (చెన్నై)లో ఉన్న మా ఫ్యామిలీ హౌస్‌కు తిరిగి వెళ్లాం. All the bright Hasans." అని రాసుకొచ్చారు సుహాసిని.

అయితే ఆ ఫొటోల్లో శ్రుతి హాసన్ మిస్సయింది. ఆమె షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల అక్కడకు రాలేకపోయింది. కాగా చాలా కాలం తర్వాత కమల్ ఆ ఇంటిని సందర్శించారు. ఇటీవల ఆ ఇంటికి కొన్ని మరమ్మతులు చేయించారు.


![]() |
![]() |