![]() |
![]() |
.jpg)
బాలీవుడ్ హీరోయిన్లు బికినీలు వెయ్యడం కామన్. వయసు మీద పడుతున్నా ఏమాత్రం సొగసు తగ్గకుండా చూసుకుంటూ బికినీల్లో అందాలు చూపించడం అక్కడ సర్వసాధారణమే. మరి, భూమి పెడ్నేకర్ బికినీ వేస్తే ఎందుకంత స్పెషల్ అన్నట్టు బాలీవుడ్ జనాలు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు? అంటే... బికినీల్లో భూమి కనిపించడం అరుదు కనుక!
కథానాయికగా పరిచయమైన 'దమ్ లాగా కె హైసా'లో స్థూలకాయురాలిగా కనిపించిన భూమి పెడ్నేకర్, ఆ తర్వాత తన శరీరాకృతిని మార్చుకున్న తీరు బరువు తగ్గాలని అనుకుంటున్న మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బరువు తగ్గడం మాత్రమే కాదు, తాను హాట్‌గా కనిపించగలనని చెప్పడానికి అన్నట్టు అప్పుడప్పుడూ హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తుంటారు. బికినీల్లో పోజులు ఇవ్వడం తక్కువే. ఒకటో రెండో అన్నట్టు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

లేటెస్టుగా బ్రౌన్ కలర్ మోనోక్రోమ్ బికినిలో భూమి పెడ్నేకర్ ఒక ఫొటో పోస్ట్ చేశారు. దాని కింద కియారా అద్వానీ 'ఉఫ్...' అంటూ ఒక ఫైర్ ఎమోజి పోస్ట్ చేశారు. హీరో ఆయుష్మాన్ ఖురానా వైఫ్ తాహిరా కశ్యప్ 'హాటీ' అని కామెంట్ చేశారు. ఈ విధంగా చాలా కామెంట్లు వచ్చాయి. భూమి బికినీ ఫొటో బాలీవుడ్‌లో సెగలు రేపుతోంది.
![]() |
![]() |