![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఇండియాకి వచ్చారు. ఒకరు ముందు, ఒకరు వెనుక! ఓ రోజు వ్యవధిలో ఇద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్టీఆర్ బుధవారమే ఇండియా చేరుకోగా... రామ్ చరణ్ గురువారం వచ్చారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో తమను ఎక్కువమంది గుర్తు పట్టకుండా ఉండడం కోసం మాస్క్ లు ధరించడంతో క్యాప్ లు పెట్టుకున్నారు.
ఈ హీరోలిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌లో జరుగుతున్న షెడ్యూల్ కంప్లీట్ కావడంతో తిరిగొచ్చారు. దీంతో సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యిందని టాక్. మరో పాటను తెరకెక్కించాల్సి ఉందట. అది కాకుండా ఉంటే కొంత ప్యాచ్ వర్క్ ఉంటుందని వినికిడి. రాజమౌళికి చివరి నిమిషం వరకు చెక్కుతూ ఉండటం అలవాటు కదా! అందుకని, ఏవో కరెక్షన్స్ చేస్తూ ఉంటారని, చెయ్యవచ్చని టాక్.
మరోవైపు ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అక్టోబర్ 13న విడుదలయ్యే ఛాన్స్ లేదని కొందరు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
![]() |
![]() |