![]() |
![]() |

నేడు సినిమా సెలబ్రిటీలకు లగ్జరీ కార్లు అనేవి స్టేటస్ సింబల్. సిల్వర్ స్క్రీన్‌పై లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు చేస్తూ అభిమానులను ఆనందపరిచే స్టార్లు, తెరబయట అదే తరహా లైఫ్‌స్టైల్‌ను కోరుకుంటున్నారు. అందుకే పాష్ ఏరియాల్లో నివాసం ఉండేవారు, అత్యంత విలాసవంతమైన వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. వారు ఉపయోగించే కార్లలో 50 లక్షల నుంచి 3 కోట్ల వరకు ఖరీదు చేసే బీఎండబ్ల్యు, మెర్సిడెస్, ఆడి, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు స్టార్ల దృష్టి ఇటాలియన్ స్టైలిష్ కార్ లంబోర్గిని మీద పడుతోంది.
నిన్నంటే నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి 'లంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్' కారు వచ్చిన విషయం ఆన్‌లైన్‌లో ఎంతగా వైరల్ అయ్యిందో చూశాం. ఆ మోడల్ ఇండియాకు రావడం ఇదే ప్రథమం. టాలీవుడ్‌లో లంబోర్గిని కారు పొందిన రెండో సెలబ్రిటీ అయ్యాడు తారక్. ఆయన కంటే ముందు లంబోర్గిని కారు ప్రభాస్ ఇంటికి వచ్చింది. సౌత్ ఇండియాలోని ఫిల్మ్ సెలబ్రిటీల్లో ఎవరెవరికి లంబోర్గిని కారు ఉందనే విషయంలోకి వెళ్తే...
ప్రభాస్

రోల్స్ రాయిస్, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యు, జాగ్వార్ లాంటి అత్యంత ఖరీదైన కార్లు వాడుతున్న ప్రభాస్ గ్యారేజ్‌లోకి ఇటీవల 'లంబోర్గిని అవెంటడార్ ఎస్ రోడ్‌స్టర్' స్పోర్ట్స్ కారు వచ్చి చేరింది. దాని ధర రూ. 6 కోట్లు.
జూనియర్ ఎన్టీఆర్

ఇండియాలోనే లంబోర్గిని 'ఉరుస్ గ్రాఫైట్ కాప్సూల్' మోడల్ కారును కొన్న తొలి కస్టమర్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్. దాని ఖరీదు రూ. 3.5 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు. బెంగళూరు షోరూమ్ నుంచి హైదరాబాద్‌లోని తారక్ ఇంటికి ఈ కారు డెలివర్ అయ్యింది.
రజనీకాంత్

అత్యంత ఖరీదైన కార్ల కలెక్షన్ సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ సొంతం. వాటిలో రూ. 3 కోట్ల విలువ చేసే 'లంబోర్గిని ఉరుస్' కూడా ఉంది.
దర్శన్

2019లోనే లంబోర్గిని కారు ఓనర్ల లిస్టులో చేరాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. ఆరు కోట్లతో 'లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్'ను సొంతం చేసుకున్నాడు. బ్రైట్ ఎల్లో కలర్‌లో చూడగానే జిగేల్ మంటుంది ఆ కారు.
పునీత్ రాజ్‌కుమార్

ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా తన భార్యకు 2019 మార్చిలో వరల్డ్ ఫాస్టెస్ట్ ఎస్‌యువి అయిన 'లంబోర్గిని ఉరుస్' కారును బహూకరించాడు కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్.
పృథ్వీరాజ్ సుకుమారన్

మలయాళం చిత్రసీమలో లంబోర్గిని కారును కొన్న ఏకైన స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. 2018లో ఆయన ఇంటికి 'లంబోర్గిని హురకాన్' వచ్చినప్పుడు అంతా చాలా గొప్పగా చెప్పుకున్నారు.
నిఖిల్ గౌడ

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడైన నిఖిల్ గౌడ దగ్గర 'లంబోర్గిని రేజింగ్' బుల్ కారు ఉంది. సౌత్ ఇండియాలోనే లంబోర్గిని కారును పొందిన తొలి వ్యక్తి అతనే. 2014లో నిఖిల్‌కు అతని తండ్రి ఆ కారును బహూకరించాడు.
ఈ స్టార్లతో పాటు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా లంబోర్గిని కారును ఉపయోగిస్తున్నాడు. ఆయన తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్. తెలుగు సినిమాలకూ పనిచేసిన హారిస్ దగ్గర 'లంబోర్గిని గాలర్డో బైకలరో' కారు ఉంది.
![]() |
![]() |