![]() |
![]() |

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` (2019), `జాతి రత్నాలు` (2021) చిత్రాలతో కథానాయకుడిగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. త్వరలో ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో.. స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టి కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాకి `రా రా కృష్ణయ్య` ఫేమ్ మహేశ్. పి దర్శకత్వం వహించబోతున్నాడు. పాతికేళ్ళ యువకుడిని ప్రేమించే 40 ఏళ్ళ అవివాహిత కథతో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. అనుష్క కాంబో మూవీ పట్టాలెక్కకముందే నవీన్ పోలిశెట్టి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నవీన్ హీరోగా తాజాగా ఓ ప్రాజెక్ట్ కన్ఫామ్ అయిందని.. `జాతిరత్నాలు` చిత్రానికి రచనా విభాగంలో పనిచేసిన కళ్యాణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడని బజ్. త్వరలోనే నవీన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానున్నది. మరి.. రానున్న సినిమాలతోనూ నవీన్ విజయపరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.
![]() |
![]() |