![]() |
![]() |

ఓటీటీలో ఇప్పటికే రెండు సినిమాలతో సందడి చేసిన కేరళకుట్టి కీర్తి సురేశ్.. త్వరలో ముచ్చటగా మూడో చిత్రంతో పలకరించబోతోందా? అవునన్నదే ఇన్ సైడ్ సోర్స్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో అమెజాన్ ప్రైమ్ లో `పెంగ్విన్`, నెట్ ఫ్లిక్స్ లో `మిస్ ఇండియా` చిత్రాలతో పలకరించింది కీర్తి. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ గా తెరకెక్కిన ఈ రెండు సినిమాలు కూడా కీర్తికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కట్ చేస్తే.. త్వరలో మరో చిత్రంతో ఓటీటీలో ఎంటర్టైన్ చేయనుందట ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. ఆ సినిమానే.. `సాని కాయిదమ్`. వెర్సటైల్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ మరో ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించింది కీర్తి.
కాగా, ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓటీటీ డీల్ పూర్తయిందని, ఓ ప్రముఖ ఓటీటీ వేదిక ఈ సినిమాని స్ట్రీమ్ చేయబోతోందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది. మరి.. `పెంగ్విన్`, `మిస్ ఇండియా` చిత్రాలతో ఓటీటీలో భంగపడ్డ కీర్తికి ఈ సినిమా అయినా ఊరటనిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |