![]() |
![]() |

మలయాళం, తెలుగు, తమిళ్.. ఇలా ముచ్చటగా మూడు భాషల్లో నటిగా తనదైన ముద్ర వేసింది సాయిపల్లవి. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. గత ఏడాది `యాక్ట్ 1978` పేరుతో ఓ సోషల్ థ్రిల్లర్ ని రూపొందించి దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు పొందిన మన్సోర్.. తన నెక్స్ట్ వెంచర్ గా ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడట. `యాక్ట్ 1978` తరహాలో ఈ సినిమా కూడా నాయిక పాత్ర చుట్టూ తిరుగుతుందట. అభినయానికి ఆస్కారమున్న ఈ వేషం కోసం సాయిపల్లవిని సంప్రదించాడట మన్సోర్. కథ, తన పాత్ర నచ్చడంతో సాయిపల్లవి కూడా ఈ ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. త్వరలోనే సాయిపల్లవి శాండల్ వుడ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, సాయిపల్లవి నటించిన తాజా తెలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్యకి జంటగా సాయిపల్లవి నటించిన `లవ్ స్టోరి` వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల కానుండగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానాకి జోడీగా నటించిన `విరాట పర్వం` అతి త్వరలోనే తెరపైకి రానుంది. అలాగే నాని సరసన ఆడిపాడిన `శ్యామ్ సింగ రాయ్` కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.
![]() |
![]() |