![]() |
![]() |

చిన్న చిన్న వేషాలతో కెరీర్ ని ఆరంభించిన సత్యదేవ్.. ఇటీవలే పదేళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నాడు. ఒకవైపు సహాయక పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు కథానాయకుడిగా నిరూపించుకునే పనిలో ఉన్నాడీ టాలెంటెడ్ యాక్టర్. కాగా, తాజాగా సత్యదేవ్ కి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ప్రతినాయకుడిగా నటించే అవకాశం దక్కింది. ఆ చిత్రమే.. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసిఫర్` రీమేక్. మాతృకలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ పాత్రను పోషించాడు.
కాగా, `లూసిఫర్` రీమేక్ లో సత్యదేవ్ కి భార్య పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతోందని సమాచారం. ఒరిజినల్ లో మంజు వారియర్ చేసిన రోల్ ఇది. ఓ టీనేజ్ అమ్మాయికి తల్లిగా నయన్ కనిపించనుంది. అలాగే, చిరుకి సోదరి తరహా పాత్రలో నయనతార దర్శనమివ్వనుంది.
ఇదిలా ఉంటే.. స్టార్ హీరోయిన్ లతో సత్యదేవ్ జోడీకట్టడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే ఛార్మితో `జ్యోతిలక్ష్మి` (2015) చేశాడు సత్య. అలాగే ప్రస్తుతం తమన్నాతో కలిసి `గుర్తుందా శీతాకాలం` అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు నయన్ తో కలిసి నటించబోతున్నాడు. కాకపోతే, ఇందులో సత్యది పూర్తిస్థాయి నెగటివ్ రోల్. అంతే తేడా!
`హనుమాన్ జంక్షన్` ఫేమ్ మోహన రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తెరపైకి రానుంది.
![]() |
![]() |