![]() |
![]() |

`సమ్మోహనం`(2018) చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సమ్మోనపరిచింది అదితి రావ్ హైదరీ. అందులో తన లుక్స్, యాక్టింగ్ స్కిల్స్ తో ఇంప్రెస్ చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆపై `అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్` (2018), `వి` (2020) చిత్రాల్లో అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. `మహాసముద్రం`లో నటిస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్ లో `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాదిలోనే తెరపైకి రానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా అదితికి ఓ మెగా ప్రాజెక్ట్ లో సెకండ్ లీడ్ గా నటించే అవకాశం దక్కిందట. ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఇద్దరు నాయికలకు స్థానముందట. ఇప్పటికే ఓ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా, సెకండ్ లీడ్ గా అదితి రావ్ హైదరీని ఎంచుకున్నారని బజ్. త్వరలోనే చిరు - బాబీ కాంబో మూవీలో అదితి ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. అదితి కెరీర్ కి ఈ మెగా ఆఫర్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |