![]() |
![]() |

ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పాలనే విషయంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ యూటర్న్ తీసుకున్నారు. ‘నా జీవితంలో ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. త్వరలో ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పేస్తా’ అని ప్రకటించి మూడు రోజులు కాకముందే మనసు మార్చుకున్నారు. ఆయన మళ్లీ ట్వీటేశారు. ఓ సీనియర్ జర్నలిస్ట్ సలహా మేరకు ట్విట్టర్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. పవన్‌కల్యాణ్‌కు సంబంధించి మాట్లాడిన ఇంటర్వ్యూ, పవన్ కల్యాణ్ కొత్త సినిమాలో స్టిల్‌తో ఆయన ట్విట్టర్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.
‘‘ప్రజలకు సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని పెద్దలు, ఓ సీనియర్ జర్నలిస్ట్ నాకు సలహా ఇచ్చారు. దానిని గౌరవంగా భావించి మళ్లీ మీ అందరి ముందుకు వస్తున్నా’’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ‘భీమ్లా నాయక్’లో పవన్ స్టిల్‌ను పోస్ట్ చేశారు. ‘సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే దేవర ఒక్కడే’ అని పేర్కొన్నారు.
సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో బండ్ల గణేశ్ స్పీచ్‌లకు, ఆయన ట్వీట్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ట్విట్టర్‌లో బండ్ల గణేష్ కొనసాగాలని నిర్ణయం తీసుకోవడంతో వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమాలో శ్రీహరి ఇంటికి ప్రకాశ్‌రాజ్ వెళ్లిన తర్వాత ‘అన్న అచ్చిండు’ అని శ్రీహరి గట్టిగా అరుస్తాడు. ఆ సీన్‌ను గుర్తు చేస్తూ, బండ్ల గణేష్ ట్విట్టర్‌కు వచ్చిండు అన్నట్టు మీమ్స్ చేశారు. వాటిలో ఒక ట్వీట్‌ను బండ్ల గణేష్ రీట్వీట్ చెయ్యడం గమనార్హం.
![]() |
![]() |