![]() |
![]() |

యువ సామ్రాట్ నాగచైతన్య తాజా చిత్రం `లవ్ స్టోరి`.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న థియేటర్స్ లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో చైతూకి జంటగా సాయిపల్లవి నటించింది.
ఇదిలా ఉంటే.. తన లక్కీ డైరెక్టర్స్ లో ఒకరైన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో `మనం` తరువాత చైతన్య మరో సినిమా చేస్తున్న విషయం విదితమే. `థాంక్ యూ` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కుతోంది. రాశీ ఖన్నా, అవికా గోర్ నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. చైతూ బర్త్ డే స్పెషల్ గా నవంబర్ 23న `థాంక్ యూ`ని రిలీజ్ చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. బర్త్ డే స్పెషల్ గా రానున్న ఈ సినిమాతో చైతూ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
కాగా, `థాంక్ యూ`కి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తుండగా.. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
![]() |
![]() |