![]() |
![]() |

స్టార్ కమెడీయన్ గా పేరు తెచ్చుకున్న సునీల్.. కథానాయకుడిగానూ తనదైన ముద్రవేశాడు. అలా.. సునీల్ హీరోగా నటించిన తొలి చిత్రమే `అందాల రాముడు`. తమిళ సినిమా `సుందర పురుషన్` (లివింగ్ స్టన్, రంభ)కి రీమేక్ వెర్షన్ గా రూపొందిన ఈ చిత్రంలో సునీల్ కి జంటగా ఆర్తి అగర్వాల్ నటించగా.. ఆకాశ్, వేణుమాధవ్, కోట శ్రీనివాసరావు, వడివుక్కరసి, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రమణ్యం, చలపతిరావు, కొండవలస, లక్ష్మీపతి, మాస్టర్ భరత్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. పి.లక్ష్మీ నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ నిర్మించారు.
ఎస్.ఎ. రాజ్ కుమార్ సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. `జాబిల్లీ రావే``, ``చిన్ని చిన్ని``, ``రాజాధి రాజా` గీతాలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ మూడు పాటలకి ఈ.ఎస్. మూర్తి సాహిత్యమందించారు. 2006 ఆగస్టు 18న విడుదలై మంచి విజయం సాధించిన `అందాల రాముడు`.. నేటితో 15 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |