![]() |
![]() |

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో నిధి అగర్వాల్ నాయికగా నటిస్తున్నారు. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం (ఆగస్ట్ 17) నిధి అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను నిర్మాతలు రిలీజ్ చేశారు. నర్తకి వేషంలో నాట్యం చేస్తున్న నిధి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో ఆమె 'పంచమి' అనే పాత్రను చేస్తున్నట్లు రివీల్ చేశారు మేకర్స్. "Beauty as ELEGANT & RADIANT as the Moon… We wish our gorgeous #PANCHAMI @AgerwalNidhhi a very Happy Birthday!" అంటూ మూవీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.
“కృష్ణ పక్ష పంచమి వెన్నెల వన్నెలవా..
శుక్ల పక్ష పంచమి నెలవంక వయ్యారానివా?
ఓ అందాల పంచమి.. ఎవరివే నీవెవరివే?” అంటూ ఆమెను వర్ణించారు.
తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసిన నిధి, "నా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్, పంచమిగా నా ఫస్ట్ పోస్టర్. నా ఫేవరేట్ పవన్ కల్యాణ్ సార్‌తో, సెట్‌పై ప్రతిరోజూ నా మైండ్‌ను బ్లో చేస్తున్నారో ఆ మోస్ట్ టాలెంటెడ్ క్రిష్ సార్ డైరెక్షన్‌లో.. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సార్.. థాంక్ యు హరిహర వీరమల్లు" అని ట్వీట్ చేసింది.
17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ "హరిహర వీరమల్లు" సినిమా రూపొందుతోంది. ఇది భారతీయ సినిమాలో ఇప్పటిదాకా చెప్పని కథ. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభవాన్ని ఇస్తుంది.
ఏ విషయంలోనూ రాజీపడని ఉన్నతస్థాయి నిర్మాణ విలువలతో నూటయాభై కోట్లకు పైగా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ యాభై శాతం పూర్తయింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత ఎ.దయాకర్ రావు తెలియచేశారు.
ఈ చిత్రానికి అగ్రశ్రేణి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీత బాణీలు అందిస్తుండగా, పేరుపొందిన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు.
![]() |
![]() |