![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `ఖుషి` ఒకటి. 2001 సమ్మర్ సెన్సేషన్ గా నిలిచిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మించారు. కట్ చేస్తే.. ఇప్పుడు పవన్, రత్నం కాంబినేషన్ లో `హరిహర వీరమల్లు` పేరుతో ఓ పిరియడ్ డ్రామా రూపొందుతోంది. వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీలో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నారు పవన్. ఇందులో పవన్ కి జంటగా నిధి అగర్వాల్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ నాయికలుగా నటిస్తున్నారు. స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని తొలుత 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో షూటింగ్ లో జాప్యం జరగడంతో వాయిదా తప్పలేదు. ఇప్పుడదే పొంగల్ సీజన్ లో పవన్ నటించిన మరో చిత్రం `భీమ్లా నాయక్` రాబోతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 2022 వేసవి కానుకగా `హరిహర వీరమల్లు` రిలీజ్ కానుందట. అంతేకాదు.. `ఖుషి` విడుదల తేదీ అయిన ఏప్రిల్ 27న ఈ సినిమాని రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |