![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ కి కలిసొచ్చిన దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` (2013), `నారప్ప` (2021) చిత్రాలు రూపొందాయి. మల్టిస్టారర్ మూవీగా తెరకెక్కిన `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` 2013 సంక్రాంతి సెన్సేషన్ గా నిలవగా.. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ `నారప్ప` కూడా మంచి వీక్షకాదరణ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. వెంకటేశ్, శ్రీకాంత్ ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనున్నారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో మంచి విజయం సాధించిన `డ్రైవింగ్ లైసెన్స్`(2019) చిత్రాన్ని వెంకీ తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు గత కొంతకాలంగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ రీమేక్ ని శ్రీకాంత్ రూపొందిస్తారట. వాస్తవానికి శ్రీకాంత్ తదుపరి చిత్రంగా `అన్నాయ్` తెరకెక్కాలి. గుంటూరు నేపథ్యంలో మూడు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమా పట్టాలెక్కడానికి మరికాస్త టైమ్ పట్టేలా ఉండడంతో.. ఈ గ్యాప్ లో ఈ రీమేక్ చేయడానికి అడ్డాల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. త్వరలోనే `డ్రైవింగ్ లైసెన్స్` రీమేక్ పై మరింత క్లారిటీ వస్తుంది.
కాగా, వెంకీ నటించిన `దృశ్యం 2` విడుదలకు సిద్ధమైంది. మరోవైపు `ఎఫ్ 3` చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
![]() |
![]() |