![]() |
![]() |

విక్రమ్, సూర్య, ఆర్య, అధర్వ.. ఇలా కోలీవుడ్ లో పలువురు కథానాయకులకు లైఫ్ ఇచ్చిన దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు బాలా. వైవిధ్యానికి పెద్ద పీట వేసే ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్.. సినిమాల సంఖ్య విషయంలో రాశి కంటే వాసికే పెద్దపీట వేస్తారు. తన నుంచి ఓ సినిమా వస్తోందంటే.. అది కచ్చితంగా `సమ్ థింగ్ స్పెషల్`గా ఉంటుందనే ముద్ర పడిపోయింది కోలీవుడ్ లో. తెలుగులోనూ ఆయన సినిమాలు అనువాదమై ఆదరణ పొందాయి కూడా.
ఇదిలా ఉంటే.. `అర్జున్ రెడ్డి` రీమేక్ `వర్మ` తరువాత మళ్ళీ మెగాఫోన్ పట్టని బాలా.. త్వరలో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారట. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. సూర్య నిర్మించనున్న ఈ సినిమాలో కేరళకుట్టి కీర్తి సురేశ్ నాయికగా నటిస్తుందని సమాచారం. అంతేకాదు.. ఇందులో కీర్తి నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించబోతుందని టాక్. అలాగే, కీర్తికి జంటగా అధర్వ నటించబోతున్నాడని వినికిడి. త్వరలోనే సూర్య - కీర్తి సురేశ్ - బాలా కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది. మరి.. ఈ చిత్రంతో కీర్తి నటిగా ఎలాంటి గుర్తింపుని పొందుతుందో చూడాలి.
![]() |
![]() |