![]() |
![]() |

ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలిగే ఈ తరం నటీమణుల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. తాజాగా మరో ఛాలెంజింగ్ రోల్ తో ఆడియన్స్ కి ముందుకు వచ్చారు ఈ కేరళకుట్టి. `నేట్రికన్` పేరుతో రూపొందిన సినిమాలో ఆమె అంధురాలి పాత్రలో కనిపించారు. ఎప్పటిలాగే తన నటనతో పాత్రకి ప్రాణం పోశారు.
ఓ యాక్సిడెంట్ లో చూపు కోల్పోయిన సీబీఐ పోలీస్ అధికారి దుర్గ (నయన్).. అమ్మాయిలని కిడ్నాప్ చేసే ఓ సైకో గైనకాలజిస్ట్ భరతం ఎలా పట్టింది? అనేదే 2 గంటల 26 నిమిషాల పాటు సాగే `నేట్రికన్` సినిమా. సైకోగా `రంగం` ఫేమ్ అజ్మల్ అమీర్ నటన కూడా ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో శుక్రవారం (ఆగస్టు 13) మధ్యాహ్నాం నుంచి స్ట్రీమ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తో నయనతార తన అభిమానులను మరోసారి మెప్పించారనే చెప్పాలి. అంధురాలి పాత్రలో తనదైన అభినయంతో అదరగొట్టి.. సినిమాకి హైలైట్ గా నిలిచారు. `గృహం` ఫేమ్ మిళింద్ రావ్ డైరెక్ట్ చేసిన `నేట్రికన్` ప్రధానంగా తమిళంలో తెరకెక్కినా.. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఓవరాల్ గా.. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి `నేట్రికన్`.. నచ్చే సినిమా అనే చెప్పాలి. నయనతార అభిమానులైతే తప్పక చూడాల్సిన చిత్రమిది.
![]() |
![]() |