![]() |
![]() |

యువ హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఇటీవల కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభించాడు. 'అర్జున్ రెడ్డి' చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన, ఆ సినిమా తమిళ రీమేక్‌కు దర్శకత్వం వహించిన గిరీశయ్యతో అతడు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 'రొమాంటిక్' భామ కేతికా శర్మ హీరోయిన్. ఆమెతో పాటు మరో ముద్దుగుమ్మ కూడా నటిస్తోంది. ఆమె పేరు శోభితా రాణా.
మంగళవారం నుండి పంజా వైష్ణవ్ తేజ్ షూటింగ్ స్టార్ట్ చేశాడు. గురువారం సెట్స్ లో శోభితా రాణా జాయిన్ అయింది. ఆమెకు తెలుగులో ఫస్ట్ మూవీ ఇది. ఇంతకు ముందు హిందీలో, కన్నడలో కొన్ని సినిమాలు చేసింది. సినిమాలో శోభితా రాణాది ప్రాముఖ్యం ఉన్న రోల్ అట. సెకండ్ హీరోయిన్ టైపు ఉంటుందేమో.
'ఉప్పెన' తర్వాత క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఒక సినిమా చేశాడు. అది విడుదల కావడానికి ముందే మరో సినిమా చేస్తున్నాడు. 'ఉప్పెన' విడుదలకు ముందే క్రిష్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ అలాగే అన్నమాట.
![]() |
![]() |