![]() |
![]() |

నటుడు అజ్మల్ అమీర్.. గుర్తున్నాడా? 2011 వేసవిలో సంచలన విజయం సాధించిన తమిళ అనువాద చిత్రం `రంగం`లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన ఈ టాలెంటెడ్ యాక్టర్.. ఆపై `రచ్చ`(2012)తో సహా కొన్ని తెలుగు సినిమాల్లో అలరించాడు. కథానాయకుడిగానూ సందడి చేశాడు. తమిళ చిత్రాలకుగానూ `ఉత్తమ సహాయ నటుడు`గా రెండు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం అందుకున్న అజ్మల్ కి.. ఎందుకనో `రంగం` స్థాయి క్యారెక్టర్ మళ్ళీ పడనేలేదు. ఈ నేపథ్యంలోనే.. రాబోయే చిత్రం `నెత్రిక్కన్`పైనే ఆశలు పెట్టుకున్నాడు అజ్మల్.
2011 నాటి కొరియన్ మూవీ `బ్లైండ్` ఆధారంగా రూపొందిన ఈ తమిళ థ్రిల్లర్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార అంధురాలిగా లీడ్ రోల్ లో నటించగా.. సైకో కిల్లర్ గా దర్శనమివ్వనున్నాడు అజ్మల్. `గృహం` ఫేమ్ మిలింద్ రావ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపు (ఆగస్టు 13) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మరి.. ఈ ఓటీటీ రిలీజ్ మూవీతో అజ్మల్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? సైకో క్యారెక్టర్ తో ఇంప్రెస్ చేసి మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటాడా? వెయిట్ అండ్ సీ!
![]() |
![]() |