![]() |
![]() |

చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ తో బుల్లితెర మీద సత్తా చాటిన ఆర్కే సాగర్ వెండితెరపై సత్తా చాటే పనిలో ఉన్నాడు. 'సిద్ధార్థ' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఈ ఏడాది 'షాదీ ముబారక్' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చింది.
సాగర్ ఇప్పుడు 'ది 100' అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఖాకీ యూనిఫామ్‌లో చేతిలో గన్ పట్టుకుని వెనక్కి తిరిగి నిలబడిన సాగర్ లుక్ ఆకట్టుకుంటోంది. 'ది 100' అనే ఆసక్తికరమైన టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాలో విక్రాంత్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో సాగర్ కనిపించబోతున్నాడు.
ఆర్కే మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. 'ది 100' మూవీ రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |