![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇటీవల దోస్తీ పాటను విడుదల చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్.. తాజాగా మరో వీడియోతో సర్‌ప్రైజ్ ఇచ్చింది.
స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగష్టు 1న విడుదలైన దోస్తీ పాట ఆకట్టుకుంటోంది. విడుదలైన అన్ని భాషల్లోనూ పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఆ పాటను పాడుతూ తారక్, చరణ్ లు కనిపించారు. మూవీ టీమ్ తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో తారక్, చరణ్ లు ఓ లగ్జరీ కారులో ఉక్రెయిన్‌లో షూటింగ్ ప్రదేశానికి ప్రయాణిస్తున్నారు. అలా కారులో వెళ్తూ దోస్తీ సాంగ్ హిందీ వెర్షన్ ను వింటూ.. హమ్ చేస్తూ కనిపించారు.
తారక్, చరణ్ లా.. ఫ్యాన్స్ కూడా దోస్తీ సాంగ్ హమ్ చేస్తూ వీడియో చేయాలని డీవీవీ ఎంటర్ టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా కోరింది. "మీరు కూడా మీ స్నేహితులతో కలిసి 'దోస్తీ' సాంగ్ వింటున్నారా? అయితే మీ వీడియోను పోస్ట్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేయండి" అంటూ ట్వీట్ చేసింది.
![]() |
![]() |