![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(మా) ఎన్నికలు వెంటనే జరపాలని కోరుతూ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకు మెగాస్టార్ చిరంజీవి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి లేఖ రాసిన 24గంటల్లో.. ఆయన బాటలోనే 113 మంది 'మా' సభ్యులు లేఖలు రాయడం హాట్ టాపిక్ గా మారింది.
'మా' ఎన్నికలు టాలీవుడ్ లో హీట్ ని పెంచాయి. సినీ ప్రముఖులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మా ఎన్నికలు వెంటనే జరపాలని కోరుతూ కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ రాసారు. 'మా' ఎన్నికలపై అనేక మంది సభ్యులు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని.. దీని వల్ల 'మా' ప్రతిష్ట మసకబారుతోందని అన్నారు. ఎన్నికలు వెంటనే జరపకపోతే వివాదాలు మరింత ముదిరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కొత్త కమిటీ ఏర్పాటు కాకపోవటం వల్ల పలు సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే ఎన్నికలు జరిపేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజును చిరంజీవి కోరారు.
చిరంజీవి లేఖకు మద్దతు తెలిపేలా.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కృష్ణంరాజును కోరుతూ.. 113 మంది మా సభ్యులు లేఖలు రాశారు. క్రమశిక్షణ సంఘానికి ఇంకా పెద్ద ఎత్తున లేఖలు వెళతాయని.. ఎన్నికల్ని త్వరగా జరిపించాలన్న డిమాండ్ ను మరింత బలంగా వినిపిస్తారని అంటున్నారు. మరి ఈ లేఖలపై కృష్ణంరాజు ఎలా స్పందిస్తారో చూడాలి.
![]() |
![]() |