![]() |
![]() |

ప్రస్తుతం టాలీవుడ్‌లోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా తమన్, దేవి శ్రీప్రసాద్ నిలుస్తారు. ఇద్దరూ ఇటు భారీ సినిమాలతో పాటు, మీడియం బడ్జెట్ సినిమాలకూ పనిచేస్తున్నారు. కాకపోతే తమన్ చేతిలో క్రేజీ సినిమాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. కొంత కాలం క్రితం వరకూ టాలీవుడ్‌ను దేవి ఏలగా, ప్రస్తుతం ఆ ప్లేస్‌ను తమన్ ఎంజాయ్ చేస్తున్నాడు. దాంతో ఆ ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ జరుగుతోందంటూ మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్‌గా ఆ ప్రచారానికి ఆ ఇద్దరూ ముగింపు పలికారు. దానికి కారణమైంది సూపర్‌స్టార్ మహేశ్ ఫ్యాన్స్.
ట్విట్టర్‌లో వారు ఓ సెషన్‌ను నిర్వహించారు. అందులో తమన్ జాయిన్ అవడం ఆలస్యం, అతడిని దేవి అభినందించాడు. మహేశ్ బర్త్‌డే సందర్భంగా సోమవారం 'సర్కారువారి పాట బ్లాస్టర్' పేరుతో మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇన్‌స్టంట్‌గా అది వైరల్ అయ్యింది. ఆ వీడియో బీజియంను తమన్ కంపోజ్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. "టీజర్ మ్యూజిక్ నాకు నచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ తమన్. కీప్ రాకింగ్ బ్రో" అని చెప్పాడు దేవి.
సినిమాలో మహేశ్ లుక్ తనను చాలా బాగా ఇంప్రెస్ చేసిందని కూడా దేవి తెలిపాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీజర్‌తో వచ్చినందుకు డైరెక్టర్ పరశురామ్‌ను కూడా అతను ప్రశంసించాడు. ఇలా ట్విట్టర్ స్పేస్‌లో దేవి-తమన్ మాట్లాడుకోవడం వారి అభిమానులను ఉత్సాహపరిచింది.
కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న 'సర్కారువారి పాట'ను 2022 జనవరి 13న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.
![]() |
![]() |