![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. 2022 సంక్రాంతికి తమ కొత్త చిత్రాలతో పలకరించనున్న సంగతి తెలిసిందే. జనవరి 12న పవన్ నటిస్తున్న `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ రిలీజ్ కానుండగా.. జనవరి 13న మహేశ్ `సర్కారు వారి పాట` సందడి చేయనుంది. ఇక జనవరి 14న ప్రభాస్ పాన్ - ఇండియా మూవీ `రాధే శ్యామ్` విడుదల కానుంది. ఇలా.. మూడు వరుస రోజుల్లో పవన్, మహేశ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిత్రాలు విడుదల కానుండడం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సంక్రాంతి బరిలో పోటీపడడం ఈ ముగ్గురికీ ఇదే తొలిసారి.
ఇదిలా ఉంటే.. 2006లోనూ ఈ ముగ్గురు బాక్సాఫీస్ ముంగిట పోటీపడ్డారు. కాకపోతే, మూడు వరుస వారాల్లో వీరి సినిమాలు సందడి చేశాయి. ఏప్రిల్ 20న ప్రభాస్ నటించిన `పౌర్ణమి` విడుదల కాగా, ఏప్రిల్ 28న మహేశ్ `పోకిరి` రిలీజైంది. మే 3న పవన్ `బంగారం` తెరపైకి వచ్చింది. ఈ ఎపిక్ క్లాష్ లో మహేశ్ దే పైచేయిగా నిలిచింది. అంతేకాదు.. ఈ పోటీలో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ని సైతం సొంతం చేసుకున్నాడు మహేశ్. మరి.. దాదాపు పదహారేళ్ళ తరువాత ఈ సారి మూడు వరుస రోజుల్లో క్లాష్ అవుతున్న వైనం.. వీరిలో ఎవరిని సంక్రాంతి విజేతగా నిలుపుతుందో చూడాలి.
![]() |
![]() |