![]() |
![]() |

సెప్టెంబర్ 2.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అంటే అభిమానులకు పండగ రోజు. ఇక ఈ ఏడాది బర్త్ డే పవన్ కి, ఆయన ఫ్యాన్స్ కి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ సెప్టెంబర్ 2తో 50 వసంతాలు పూర్తిచేసుకుంటున్నారు పవన్.
ఇదిలా ఉంటే.. పవన్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి స్పెషల్ అప్డేట్స్ ఉండబోతున్నాయని టాక్. ఆ రోజు.. `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ తాలూకు టైటిల్ ని రివీల్ చేస్తూ టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అలాగే, క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న `హరిహర వీరమల్లు` నుంచి ఓ మేకింగ్ వీడియోని విడుదల చేయబోతున్నారని సమాచారం. అంతేకాదు.. `గబ్బర్ సింగ్` తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్న కొత్త సినిమాకి సంబంధించి టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నట్లు వినికిడి.
మొత్తమ్మీద.. పవన్ 50వ బర్త్ డేకి `ట్రిపుల్ ట్రీట్` ఉండబోతోందన్నమాట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. అలాగే, `హరిహర వీరమల్లు`ని 2022 వేసవిలో రిలీజ్ చేయబోతున్నట్లు బజ్.
![]() |
![]() |