![]() |
![]() |
.jpg)
దర్శకుడు మెహర్ రమేశ్ కి స్ట్రయిట్ పిక్చర్స్ కంటే రీమేక్స్ నే బాగా అచ్చొచ్చాయి. `ఆంధ్రావాలా`, `ఒక్కడు` చిత్రాలను కన్నడలో రీమేక్ చేసి విజయాలు అందుకున్న మెహర్.. తమిళ్ `బిల్లా`ని తెలుగులో అదే పేరుతో తెరకెక్కించి చెప్పుకోదగ్గ సక్సెస్ చూశాడు. కట్ చేస్తే.. పుష్కరకాలం తరువాత మరో రీమేక్ పట్టాలెక్కించనున్నాడు ఈ స్టైలిష్ ఫిల్మ్ మేకర్. కాగా, ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి ముహూర్తం ఫిక్స్ అయిందని బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. తమిళంలో విజయం సాధించిన `వేదాళమ్` చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేయబోతున్నాడు మెహర్. చిరు పుట్టినరోజుని పురస్కరించుకుని ఆగస్టు 22న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ఆరంభించనున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. `శక్తి`, `షాడో` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ అందుకున్న మెహర్.. `వేదాళమ్` రీమేక్ తో హిట్ కొడతాడేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. చిరు ప్రస్తుతం `ఆచార్య`ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. అదయ్యాక `లూసిఫర్` రీమేక్ చేయబోతున్నారు. ఆ తరువాతే `వేదాళమ్` రీమేక్, బాబీ డైరెక్టోరియల్ సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటాయని టాక్.
![]() |
![]() |