![]() |
![]() |

అతి తక్కువ కాలంలోనే నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. సోషల్ మీడియాలోనూ రోజురోజుకి తన క్రేజ్ ను పెంచుకుంటున్న విజయ్.. ఇప్పుడు మరో రికార్డ్ ను సాధించాడు. ఫేస్‌బుక్ లో 10 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
ఫేస్ బుక్ లో కోటి మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు విజయ్. సౌత్ లో ఈ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో విజయ్ ఒకడు. దీనితో పాటు టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలకు అందని మరో అరుదైన ఘనతని కూడా సాధించాడు విజయ్. ప్రముఖ మ్యాగజైన్ 'హలో' దేశవ్యాప్తంగా తాజాగా విడుదల చేసిన 'హలో పవర్ లిస్టు 2021'లో విజయ్ స్థానం పొందాడు. టాలీవుడ్ నుండి ఈ లిస్టులో విజయ్ తో పాటు మహేష్ బాబు కూడా చోటు దక్కించుకున్నాడు.

కాగా విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.
![]() |
![]() |