![]() |
![]() |

చెల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన తేజ సజ్జా.. హీరోగా మారి అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'జాంబిరెడ్డి'లో హీరోగా నటించి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే 'హనుమాన్' అనే సినిమా చేస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితమే తేజ 'ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ' అనే సినిమాలో నటించాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.
తేజ హీరోగా నటించిన 'ఇష్క్' సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఒకానొక సమయంలో ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుందని టాక్ కూడా వినిపించింది. అయితే ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు మేకర్స్.

ఎస్.ఎస్.రాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో తేజకు జోడిగా ప్రియా ప్రకాశ్ వారియర్ అలరించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.
![]() |
![]() |