![]() |
![]() |
.jpg)
మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి సైతం తండ్రి తరహాలోనే విలక్షణ బాటలో పయనిస్తున్నారు. నటిగా రాణిస్తూ, ఆలోచనాత్మక చిత్రాలను నిర్మిస్తూ, వైవిధ్యమైన టీవీ ప్రోగ్రామ్‌లను హోస్ట్ చేస్తూ విభిన్న రీతుల్లో తన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. తొలి చిత్రం 'అనగనగా ఓ ధీరుడు'తో ఉత్తమ విలన్‌గా నంది అవార్డును అందుకున్న ఘనత ఆమె సొంతం. అలాగే 'చందమామ కథలు' చిత్రంతో మరోసారి బెస్ట్ సపోర్టింగ్ ఫిమేల్ ఆర్టిస్ట్‌గా రెండో నందిని ఆమె అందుకున్నారు.
2004లోనే 'లాస్ వేగాస్' అనే అమెరికన్ టీవీ షోతో నటిగా బుల్లితెరపై అడుగుపెట్టిన లక్ష్మి, 2008లో 'లక్ష్మీ టాక్ షో'తో ప్రయోక్తగా మారారు. ఆ తర్వాత ప్రేమతో మీ లక్ష్మి, లక్కుంటే లక్ష్మి, సూపర్ జోడి, దూసుకెళ్తా, మీ కోసం, మేము సైతం, మహారాణి అనే షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. లేటెస్ట్‌గా 'ఆహా భోజనంబు' అనే వంటల షోను ఆమె హోస్ట్ చేస్తున్నారు. దీని మొదటి ఎపిసోడ్ త్వరలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది.
.jpg)
ఈ ఎపిసోడ్‌లో 'మాస్ కా దాస్' విష్వక్ సేన్ కొత్త అవతారంలో మన ముందు ప్రత్యక్షం అవనున్నాడు. అతనిలోని వంటవాడిని, ఆ వంటవాడిలోని సామర్థ్యాల్ని ఆమె వెలికి తీయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన మంచు లక్ష్మి, "Straight outta #ahaBhojanambu's kitchen and into our bellies! A fun evening of fusion lo confusion cooking with @vishwaksens. What do you think he cooked for us? Stay Tuned, Episode 1 will be streaming soon on #ahavideoIN ." అని రాసుకొచ్చారు.
.jpg)
ఈ షోతో లక్ష్మి ఎవరెవర్ని మన ముందుకు తీసుకొస్తారో, వంటల్లో ఆ సెలబ్రిటీల సత్తా ఏంటో మనం చూడబోతున్నాం.
![]() |
![]() |