![]() |
![]() |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న యాక్షన్ డ్రామా పుష్పలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దాంతో పిల్లలు అయాన్, అర్హ లను చూసే బాధ్యత అంతా ఆయన భార్య స్నేహారెడ్డి చూసుకుంటోంది. ఈ మధ్యలో బన్నీ ఇంటి దగ్గర భూతాలు కనిపించడం కలకలం రేపింది.
సోషల్ మీడియాలో స్నేహ పోస్ట్ చేసిన వీడియోలో వారి ఇంట్లో రెండు భూతాలు భయపెడుతూ కనిపించాయి. ఆ భూతాలు రెండూ తెల్లటి వస్త్రాన్ని కప్పుకొని, కళ్లకు కలర్ గ్లాసెస్ పెట్టుకొని ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ భూతాలు ఎవరో కాదు.. అయాన్, అర్హ అనీ.. నాటీ భూతాలుగా మారి భయపెట్టారనీ స్నేహారెడ్డి వెల్లడించారు. వీడియోను షేర్ చేసిన ఆమె దానికి "Peek-a-boo.. my little naughty #ghosts #ghostphotoshoot #ayaan #arha " అనే క్యాప్షన్ జోడించారు.

కాగా, అల్లు అర్హ వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గుణశేఖర్ రూపొందిస్తోన్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం'లో యువరాజు భరతునిగా అర్హ కనిపించనున్నది. శకుంతలగా సమంత, దుష్యంతునిగా మలయాళం నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. వారి కుమారుడే భరతుడు. ఇప్పటికే అర్హ తన సీన్లు చేసేసిందనీ, షాట్ చిత్రీకరణలో తన డైలాగ్స్‌ను ఆమె చెప్పిన విధానం యూనిట్ మెంబర్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందనీ సమాచారం.
![]() |
![]() |